ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా.. జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
ABN , Publish Date - Jul 25 , 2026 | 04:48 PM
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటించిన వెంటనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు.
న్యూఢిల్లీ, జులై 25: కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ప్రకటించిన వెంటనే ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరసనకారులు పోలీసులపై రాళ్ల దాడికి దిగారు. నిరసనకారుల రాళ్లదాడిలో ఇద్దరు పోలీసులు గాయపడ్డారు. వారి తలలకు తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడ్డ పోలీసులను వెంటనే ఆస్పత్రికి తరలించారు.
పరిస్థితిని అదుపు చేసేందుకు పోలీసులు భాష్పవాయు గోళాలు ప్రయోగించారు. నిరసనకారులపై లాఠీఛార్జ్ చేశారు. ఈ నేపథ్యంలోనే జంతర్ మంతర్ వద్ద అదనపు బలగాలు మోహరించాయి. ప్రస్తుతం అక్కడి పరిస్థితి అదుపులోనే ఉన్నట్లు సమాచారం.
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో మారుతున్న పరిణామాలు
మంత్రి పదవికి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసిన నేపథ్యంలో న్యూఢిల్లీలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఢిల్లీ రావాలని మహారాష్ట్ర సీఎం ఫడణవీస్‌కు అధిష్టానం నుంచి పిలుపు వచ్చింది. సీఎంతో పాటు డిప్యూటీ సీఎం షిండేకు కూడా ఢిల్లీ పెద్దల నుంచి పిలుపు వచ్చింది. కీలక నేతలకు హైకమాండ్ నుంచి పిలుపు రావటంతో రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.
ఇవి కూడా చదవండి
ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థుల విజయమే: మంత్రి పొన్నం ప్రభాకర్
వారే నిజమైన దేశభక్తులు: రాహుల్ గాంధీ