Share News

Kuldeep Singh Sengar: కస్టోడియల్‌ మృతి కేసులో..

ABN , Publish Date - Jan 20 , 2026 | 01:26 AM

ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన లాకప్‌ మృతి కేసులో శిక్ష అనుభవిస్తున్న బీజేపీ బహిష్కృత నేత కులదీప్‌ సింగ్‌ సెంగార్‌కు సోమవారం ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురయింది.

Kuldeep Singh Sengar: కస్టోడియల్‌ మృతి కేసులో..

  • సెంగార్‌ శిక్ష సస్పెన్షన్‌కు ఢిల్లీ హైకోర్టు నిరాకరణ

న్యూఢిల్లీ, జనవరి 19: ఉత్తరప్రదేశ్‌లోని ఉన్నావ్‌లో జరిగిన లాకప్‌ మృతి కేసులో శిక్ష అనుభవిస్తున్న బీజేపీ బహిష్కృత నేత కులదీప్‌ సింగ్‌ సెంగార్‌కు సోమవారం ఢిల్లీ హైకోర్టులో నిరాశ ఎదురయింది. ఆయన శిక్షను సస్పెండ్‌ చేయడానికి ధర్మాసనం నిరాకరించింది. ఉన్నావ్‌లో బాలికపె ౖజరిగిన అత్యాచారం చేసిన కేసులో ఆయన జీవితకాల కారాగార శిక్ష అనుభవిస్తున్నారు. ఆ కేసు విచారణ జరుగుతున్న సమయంలో బాధితురాలి తండ్రి పోలీసు కస్టడీలో మరణించడంతో సెంగార్‌పై కూడా కేసు పెట్టారు. ఈ రెండో కేసులో ఆయనకు పదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.10 లక్షల జరిమానా విధిస్తూ ట్రయల్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. ఇప్పటికే తొమ్మిదేళ్లు జైలులో ఉన్నానని, ఇంకా 11 నెలలు మాత్రమే మిగిలి ఉన్నందున శిక్షను సస్పెండ్‌ చేయాలని ఆయన ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ట్రయల్‌ కోర్టు తీర్పుపై తాను చేసిన అప్పీలు ఇంకా పెండింగ్‌లో ఉందని తెలిపారు. అప్పీలు పెండింగ్‌లో ఉందన్న కారణంతో శిక్షను సస్పెండ్‌ చేయలేమని కేసును విచారించిన జస్టిస్‌ రవీందర్‌ డుదేజా తెలిపారు.

Updated Date - Jan 20 , 2026 | 01:26 AM