Share News

ఖాళీ చేయాలనిఢిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం నోటీసులు

ABN , Publish Date - May 24 , 2026 | 04:08 AM

ఢిల్లీ జింఖానా క్లబ్‌ను ఖాళీ చేయాలంటూ నిర్వాహకులకు కేంద్రం నోటీసులిచ్చింది. లీజుకు తీసుకున్న 27.3 ఎకరాల స్థలంతో పాటు భవనాలు...

ఖాళీ చేయాలనిఢిల్లీ జింఖానా క్లబ్‌కు కేంద్రం నోటీసులు

న్యూఢిల్లీ, మే 23: ఢిల్లీ జింఖానా క్లబ్‌ను ఖాళీ చేయాలంటూ నిర్వాహకులకు కేంద్రం నోటీసులిచ్చింది. లీజుకు తీసుకున్న 27.3 ఎకరాల స్థలంతో పాటు భవనాలు, ఇతర కట్టడాలను జూన్‌ 5లోగా తమకు అప్పగించాలని శుక్రవారం ఆదేశాలు ఇచ్చింది. రక్షణ సౌకర్యాల కోసం ఈ స్థలం తమకు కావాల్సి ఉందని తెలిపింది. ఈ క్లబ్‌ ప్రధాని నివాసానికి సమీపంలోని 2-సఫ్దర్‌జంగ్‌ రోడ్డులో ఉంది. దీనిపై క్లబ్‌ సభ్యుడు సిద్దార్థ్‌ మాట్లాడుతూ ఈ క్లబ్‌ కారణంగా భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు లేవని, కోర్టు ను ఆశ్రయిస్తామని చెప్పారు. బ్రిటిష్‌ పాలనలోని మిలటరీ అధికారుల కోసం 1913 జూలై 3న ఈ క్లబ్‌ ఏర్పాటైంది. ప్రస్తుతం ఉన్న భవనాలను 1930 ప్రాంతంలో నిర్మించారు.

Updated Date - May 24 , 2026 | 04:08 AM