Share News

మారాకు వేసిన ప్రేమబంధం

ABN , Publish Date - Jun 15 , 2026 | 03:23 AM

ముక్కలైన హృదయాలు కూడా అతుక్కుంటాయి. పెదవులు దాటని చిరునవ్వే అందుకు మందుగా పనికొస్తుంది. ఢిల్లీలోని న్యాయస్థానమే ఇందుకు ప్రత్యక్ష సాక్షి...

మారాకు వేసిన ప్రేమబంధం

  • విడాకుల కేసుకు అనూహ్య ముగింపు

  • కోర్టులోనే భర్త కౌగిట్లో బందీ అయిన భార్య

న్యూఢిల్లీ, జూన్‌ 14: ముక్కలైన హృదయాలు కూడా అతుక్కుంటాయి. పెదవులు దాటని చిరునవ్వే అందుకు మందుగా పనికొస్తుంది. ఢిల్లీలోని న్యాయస్థానమే ఇందుకు ప్రత్యక్ష సాక్షి. విడాకులు మంజూరయ్యే సమయంలో దంపతులిద్దరూ ఒకటవడం వివాహబంధం విశిష్ఠతను చాటి చెప్పింది. శిఖా, సౌరభ్‌లకు 2020లో పెళ్లి జరిగింది. కొద్ది రోజులకే ఇద్దరి మఽధ్య గొడవలు మొదలయ్యాయి. విడాకుల కోసం కోర్టుకెక్కారు. కుమార్తె న్యాయపోరాటం కోసం తన దగ్గర ఉన్న సొమ్మునంతా వెచ్చించారు శిఖా తండ్రి. క్రమేణా అనారోగ్యం పాలైన ఆయనకు ఇటీవల గుండెపోటు వచ్చింది. డబ్బుల్లేక కుటుంబ సభ్యులు ఆయనను ప్రభుత్వ ఆస్పత్రిలో చేర్చారు. ఇక్కడే కథ మలుపు తిరిగింది. అల్లుడు సౌరభ్‌ వచ్చి ఆయనను గురుగ్రాంలోని అన్ని సౌకర్యాలు ఉన్న ప్రయివేటు ఆస్పత్రిలో చేర్పించాడు. మామ కోలుకున్నాడు. మరుసటి రోజున కోర్టులో విచారణ ఉండడంతో భార్యాభర్తలిద్దరూ వెళ్లారు. న్యాయవాదులు యథావిధిగా వాదనలు వినిపించారు. జడ్జి సౌరభ్‌ వైపు చూస్తూ ‘విడాకులు కావాలని ఇప్పటికీ కోరుకుంటున్నావా?’ అని అడిగారు. ఆయన సమాధానం ఇవ్వకుండా భార్యవైపు చూస్తూ పెదవులు దాటని, కనీకనిపించని చిరునవ్వును నవ్వాడు. శిఖ మనసు కరిగిపోయింది. ఏళ్ల తరబడి గూడుకట్టుకున్న కోపాన్ని మరిచిపోయింది. వెంటనే విడాకుల కాగితాలను చింపివేసి, భర్తవైపు వడివడిగా వెళ్లింది. ఆయనను హృదయానికి గాఢంగా హత్తుకొంది.

Updated Date - Jun 15 , 2026 | 03:23 AM