ప్రత్యేకమైన దోమలతో డెంగీకి చెక్
ABN , Publish Date - Nov 22 , 2026 | 07:22 AM
దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగీ వ్యాధికి ఆ దోమలతోనే చెక్‌పెట్టే విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు.
వాషింగ్టన్, నవంబరు 21: దోమల ద్వారా వ్యాప్తి చెందే డెంగీ వ్యాధికి ఆ దోమలతోనే చెక్‌పెట్టే విధానాన్ని శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. డెంగీ ఒక్కటే కాదు.. చికున్‌గున్యా సహా మరికొన్ని రకాల వైరస్‌లను కూడా వ్యాప్తి చేయలేని ప్రత్యేకమైన దోమలను అభివృద్ధి చేశారు. ‘వోల్బాకియా’గా పిలిచే బ్యాక్టీరియా ఉండే ఈ దోమలను వదలడం ద్వారా.. పిల్లల్లో డెంగీ, చికున్‌గున్యా వ్యాధుల వ్యాప్తిని 69 శాతం వరకు తగ్గించగలిగినట్టు పరిశోధనలో గుర్తించారు. డెంగీ తీవ్రత ఎక్కువ ఉన్న ప్రాంతాల్లో ఒకటైన బ్రెజిల్‌లో 5,700 మందికి పైగా పిల్లలపై ఈ అధ్యయనం చేశారు. బ్రెజిల్‌లో డెంగీ తీవ్ర స్థాయిలో విజృంభించిన సమయంలోనూ ఈ ప్రభావం కొనసాగిందని అంతర్జాతీయ పరిశోధనా బృందంలో భాగమైన ఎమరీ యూనివర్సిటీ ప్రొఫెసర్ శ్రీ ఈడుపుగంటి తెలిపారు.