కోర్టు విడిచిపెట్టినా ఢిల్లీ ప్రజలు ఇప్పటికే తీర్పునిచ్చారు
ABN , Publish Date - Feb 28 , 2026 | 05:31 AM
‘కేజ్రీవాల్ అవినీతిపరుడని గట్టిగా నమ్ముతున్నాను. కోర్టు వారిని విడిచిపెట్టొచ్చు. ఢిల్లీ ప్రజలు ఇప్పటికే తమ తీర్పును వెల్లడించారు. ప్రజల సానుభూతి కోసం మీడియా ముందు ఆయన కంటతడి...
కేజ్రీవాల్ అవినీతిపరుడని నమ్ముతున్నా: ఢిల్లీ బీజేపీ చీఫ్
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 27: ‘కేజ్రీవాల్ అవినీతిపరుడని గట్టిగా నమ్ముతున్నాను. కోర్టు వారిని విడిచిపెట్టొచ్చు. ఢిల్లీ ప్రజలు ఇప్పటికే తమ తీర్పును వెల్లడించారు. ప్రజల సానుభూతి కోసం మీడియా ముందు ఆయన కంటతడి పెట్టుకొని డ్రామాలాడుతున్నారు. ఆప్ నేత సత్యేంద్ర జైన్‌కు భారతరత్న ఇవ్వాలి. ఆయన మీడియా ముందు చేసిన ప్రదర్శనకు బాలీవుడ్‌కు పంపితే మంచిది’ అని ఢిల్లీ బీజేపీ అధ్యక్షుడు వీరేంద్ర సచ్‌దేవా ఘాటుగా వ్యాఖ్యానించారు. మద్యం పాలసీకి సంబంధించి అనేక కీలకాంశాలపై కేజ్రీవాల్ వద్ద ఇప్పటికీ సమాధానాలే లేవని.. వారు ప్రవేశపెట్టిన మద్యం విధానం సరైనదే అయితే దర్యాప్తు ప్రారంభమైన వెంటనే ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు.