Share News

ఢిల్లీలో ఆందోళనకరంగా వాయుకాలుష్యం

ABN , Publish Date - Nov 10 , 2026 | 02:54 AM

దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణంపై దీపావళి టపాసుల ప్రభావం తీవ్రంగా పడింది. ఆది, సోమవారాల్లో వాయుకాలుష్యం తీవ్ర స్థాయిలో నమోదైంది.

ఢిల్లీలో ఆందోళనకరంగా వాయుకాలుష్యం

న్యూఢిల్లీ, నవంబరు 9: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణంపై దీపావళి టపాసుల ప్రభావం తీవ్రంగా పడింది. ఆది, సోమవారాల్లో వాయుకాలుష్యం తీవ్ర స్థాయిలో నమోదైంది. గత ఐదేళ్లలో అత్యంత అత్యధిక కాలుష్యం ఈసారే నమోదైంది. కాలుష్యం దెబ్బకు ఏకంగా గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాలు పనిచేయడం కూడా నిలిచిపోయింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్‌లోని చాలా ప్రాంతాల్లో వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకర స్థాయిలో ఉన్న ప్రైవేటు పర్యవేక్షణ కేంద్రాలు పేర్కొన్నాయి. ఢిల్లీలో మొత్తం 59 గాలి నాణ్యత పర్యవేక్షణ కేంద్రాల డేటాను పరిశీలించగా.. దీపావళి రాత్రి గడిచేకొద్దీ డేటా అందుబాటులో లేని కేంద్రాల సంఖ్య పెరిగినట్లు వెల్లడైంది. ఆదివారం రాత్రి 7 గంటలకు కేవలం ఒక కేంద్రంలో మాత్రమే డేటా అందుబాటులో లేకపోగా.. రాత్రి 1 గంట సమయానికి ఏకంగా 36 కేంద్రాలు పనిచేయలేదు. కేవలం 23 కేంద్రాలు మాత్రమే ఆ సమయంలో గాలి నాణ్యత వివరాలను నమోదు చేశాయి. ఆ తరువాత నుంచి సోమవారం మధ్యాహ్నం వరకు క్రమంగా ఆయా కేంద్రాలు పనిచేయడం ప్రారంభించాయి. కాగా, సోమవారం ఉదయం 10 గంటలకు ఢిల్లీ ఏక్యూఐ 371గా ఉన్నట్లు అధికారిక గణాంకాలు వెల్లడించాయి. దీపావళి వరుసటి రోజు గణాంకాల్లో 2021 తరువాత ఇదే అత్యధికం.

Updated Date - Nov 10 , 2026 | 02:55 AM