Share News

ఢిల్లీలో మరో నిర్భయ!

ABN , Publish Date - Sep 19 , 2026 | 03:29 AM

ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఆనవాళ్లు కూడా గుర్తించలేని విధంగా పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో 13వ తేదీన ఓ మృతదేహం కనిపించింది. ఎక్కడికక్కడ వీధి కుక్కలు పీక్కుతినేయడంతో మృతదేహం ఆడా.. మగా అనేదీ తెలుసుకోలేనంతంగా.. చివరికి ముఖాన్ని గుర్తుపట్టడమూ సవాలుగా మారింది.

ఢిల్లీలో మరో నిర్భయ!
RAPE VICTIM

  • కదులుతున్న టెంపోలో 17ఏళ్ల బాలికపై

  • గ్యాంగ్‌రేప్‌

ముగ్గురు మైనర్లు సహా నలుగురి ఘోరం

ఆపై హత్య.. ఓ పొలంలో శవం విసిరివేత

నిందితులు ఆమెకు తెలిసినవారే..

1న ఘటన.. 13రోజులకు వెలుగులోకి

పీక్కుతిన్న కుక్కలు.. ఆ చోటంతా దుర్గంధం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 18: ఓ నిర్మానుష్య ప్రదేశంలో ఆనవాళ్లు కూడా గుర్తించలేని విధంగా పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో 13వ తేదీన ఓ మృతదేహం కనిపించింది. ఎక్కడికక్కడ వీధి కుక్కలు పీక్కుతినేయడంతో మృతదేహం ఆడా.. మగా అనేదీ తెలుసుకోలేనంతంగా.. చివరికి ముఖాన్ని గుర్తుపట్టడమూ సవాలుగా మారింది. మృతదేహం నుంచి ఓ చేయి వేరుపడి పక్కన పడి ఉంది. పరిశీలనగా చూస్తే కత్తులతో విచక్షణారహితంగా పొడిచి చంపినట్లు అర్థమవుతోంది. అది 17 ఏళ్ల బాలిక మృతదేహం అని అతికష్టమ్మీద తెలుసుకోగలిగారు!! దేశరాజధాని ఢిల్లీలోని ఉత్తర ప్రాంతం స్వరూప్ నగర్ లోని కుషాక్‌రోడ్‌లోని ఓ పొలంలో ఈ మృతదేహంలభించింది!! ఇంతకీ ఆమెను ఎవరు? ఎందుకు చంపారు? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయగా మానవతావాదులకు ఒళ్లు జలదరింపజేసేలా వాస్తవాలు వెలుగుచూశాయి! ఆమెపై ముగ్గురు మైనర్లు సహా నలుగురు దారుణంగా అత్యాచారం జరిపారు. నిందితులంతా ఆమెకు పరిచయస్తులే! సెప్టెంబరు 1న ఓ స్నేహితుడిని కలిసేందుకు ఆమె ఇంట్లోంచి బయటకు వెళ్లింది. ఆ స్నేహితుడు ఆమెతో పాటు తనకు తెలిసిన ముగ్గురు మైనర్లను ఓ టెంపోలో ఎక్కించుకొని బయలుదేరాడు.


ఆ వాహనంలోనే నలుగురు కలిసి మద్యం తాగారు. ఆ మత్తులో బాలికపై ఒకరి తర్వాత మరొకరు అత్యాచారానికి ఒదిగట్టారు. అనంతరం ఆమెను కత్తులతో పొడిచి చంచేసి.. స్వరూ్‌పనగర్‌ వద్ద మృతదేహాన్ని ఓ పొలంలో పడేశారు. సాధారణంగా బాలికకు ఇల్లు వదిలి వెళ్లాక చాలారోజులకు తిరిగొచ్చే అలవాటు ఉండటంతో ఆమె ఇంటికి తిరిగిరాకపోయినా కూడా ఇన్నాళ్లు బాధిత కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయలేకపోయారు. 13న స్థానికులు మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారమిచ్చారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు, ఆమెపై సామూహిక అత్యాచారం జరిగినట్లు నివేదిక ఇచ్చారు. ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులకు టెంపో మీద నెంబర్‌ ప్లేట్‌ అస్పష్టంగా కనిపించడంతో 16, 17 తేదీల్లో 50కి పైగా సీసీ ఫుటేజీలను విశ్లేషించారు. అనంతరం ప్రధాన నిందితుడు, ఢిల్లీలోని ఖడ్డా కాలనీకి చెందిన శివమ్‌ అలియాస్‌ సుధామ అలియాస్‌ చూచూ (19) అనే యువకుడు సహా 16-17 ఏళ్ల వయసున్న ముగ్గురు మైనర్లనూ అదుపులోకి తీసుకున్నారు. బాలికపై దాడిలో రెండు కత్తులు ఉపయోగించారని నిర్ధారించి.. వాటిని, టెంపోను స్వాధీనం చేసుకున్నారు. నలుగురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వారిపై పోక్సో సహా భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి

కాంగ్రెస్ అభ్యర్థికి మమతా బెనర్జీ మద్దతు.. ఇంతలోనే అరెస్టు

బర్క్‌షైర్ హ్యాథవే చైర్మన్ పదవి నుంచి తప్పుకున్న వారెన్ బఫెట్

Updated Date - Sep 19 , 2026 | 03:29 AM