Share News

మా లక్ష్యంప్రభుత్వ మార్పు కాదు

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:27 AM

సీఈసీకి వ్యతిరేకంగా తాము చేపట్టిన ఆందోళనను ప్రభుత్వ మార్పు కోసం జరుగుతున్న పోరాటంగా అభివర్ణించడాన్ని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే తప్పుబట్టారు.

మా లక్ష్యంప్రభుత్వ మార్పు కాదు
dipke

  • ప్రశాంత్‌ భూషణ్‌, నేహా బోరా చేసిన వ్యాఖ్యలతో మాకు సంబంధం లేదు

  • జ్ఞానేశ్‌ను తొలగించాలన్నదే మా డిమాండ్‌: దీప్కే

న్యూఢిల్లీ, అక్టోబరు 16: సీఈసీకి వ్యతిరేకంగా తాము చేపట్టిన ఆందోళనను ప్రభుత్వ మార్పు కోసం జరుగుతున్న పోరాటంగా అభివర్ణించడాన్ని సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్‌ దీప్కే తప్పుబట్టారు. కేంద్రంలో ప్రభుత్వాన్ని మార్చడం, హింసను ప్రేరేపించడం తమ లక్ష్యం కాదని.. సీఈసీ జ్ఞానేశ్‌కుమార్‌ను పదవి నుంచి తొలగించాలన్నదే తమ ప్రధాన డిమాండ్‌ అని చెప్పారు. ప్రభుత్వ మార్పే లక్ష్యమంటూ ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌, బంగ్లాదేశ్‌లో ప్రభుత్వాన్ని కూల్చిన తరహా జెన్‌ జీ ఉద్యమం నుంచి స్ఫూర్తి పొందామని విద్యార్థి సంఘం నాయకురాలు నేహా బోరా చేసిన వ్యాఖ్యలతో తమకు సంబంధం లేదని స్పష్టం చేశారు. శుక్రవారం రాత్రి ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ‘‘ప్రభుత్వాన్ని మార్చాలని మేం అనడం లేదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో చేయాలని కూడా కోరుకోవడం లేదు. సీఈసీ జ్ఞానేశ్‌ను తొలగించి.. నిష్పక్షపాతంగా వ్యవహరించే కొత్త సీఈసీని నియమించాలని మాత్రమే మేం కోరుతున్నాం’’ అని చెప్పారు.

Updated Date - Oct 17 , 2026 | 04:27 AM