ఆ కంటి మందుకు అనుమతుల్లేవు
ABN , Publish Date - Mar 20 , 2026 | 05:14 AM
అన్ని ప్రముఖ ఫార్మా కంపెనీలు తమ స్వంత బ్రాండింగ్‌తో మార్కెట్లోకి దించిన కంటి చుక్కల మందు... ‘సోడియం హైల్యూరోనేట్ ఐ డ్రాప్స్...
తక్షణమే తయారీ అనుమతులు రద్దు చేయండి
రాష్ట్రాల డ్రగ్ కంట్రోల్ అధికారులకు డీసీజీఐ ఆదేశాలు
న్యూఢిల్లీ, మార్చి 19: అన్ని ప్రముఖ ఫార్మా కంపెనీలు తమ స్వంత బ్రాండింగ్‌తో మార్కెట్లోకి దించిన కంటి చుక్కల మందు... ‘సోడియం హైల్యూరోనేట్ ఐ డ్రాప్స్ 0.3 శాతం డబ్ల్యూ/వీ’ ఫార్మా దుకాణాల్లో, ఆన్‌లైన్‌లో విరివిగా అందుబాటులో ఉంది. డ్రై ఐస్.. కళ్లు పొడిబారే సమస్య నివారణకు దీనిని వాడుతున్నారు. అయితే ఆ మందు తయారీ, అమ్మకాలకు ఎలాంటి అనుమతి లేదని డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా(డీసీజీఐ) బుధవారం పేర్కొంది. ఆ మందు తయారీకి ఇచ్చిన అన్ని అనుమతులనూ తక్షణమే రద్దు చేయాలని అన్ని రాష్ట్రాలకు ఉత్తర్వులు జారీ చేసింది. ‘న్యూ డ్రగ్’ తరగతికి చెందిన ఈ మందు తయారీకి, అమ్మకాలకు మన దేశంలో ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేసింది. రాష్ట్రాల్లోని డ్రగ్స్ కంట్రోలర్లు తక్షణమే ఈ విషయాన్ని తయారీదారులకు తెలియచేసి, తీసుకున్న చర్యలను వీలైనంత త్వరగా డీసీజీఐ కార్యాలయానికి తెలియచేయాలని పేర్కొంది.