ఉత్తరాదిలో అమ్మాయిలను వంటగదికే పరిమితం చేస్తున్నారు: దయానిధి
ABN , Publish Date - Jan 15 , 2026 | 05:00 AM
మిళనాడులో అమ్మాయిల్ని చదువుకోవాలని చెబుతుండగా, ఉత్తరాదిలో మాత్రం వారిని వంటగదికి పరిమితమై, పిల్లల్ని కంటే చాలని చెబుతున్నారని డీఎంకే సీనియర్ నేత...
చెన్నై, జనవరి 14(ఆంధ్రజ్యోతి): తమిళనాడులో అమ్మాయిల్ని చదువుకోవాలని చెబుతుండగా, ఉత్తరాదిలో మాత్రం వారిని వంటగదికి పరిమితమై, పిల్లల్ని కంటే చాలని చెబుతున్నారని డీఎంకే సీనియర్ నేత, లోక్‌సభ సభ్యుడు దయానిధి మారన్ వ్యాఖ్యానించారు. బుధవారం చెన్నైలో ఉపముఖ్యమంత్రి ఉదయనిధి నేతృత్వంలో జరిగిన ఓ కార్యక్రమంలో దయానిధి మాట్లాడుతూ.. ‘తమిళనాడులో మేం యువతులను చదుకోవాలని చెబుతున్నాం. కానీ, ఉత్తర భారతంలో ఏం చెబుతున్నారు? అమ్మాయిలు ఉద్యోగాలకు వెళ్లరాదు. ఇంట్లోనే ఉండాలి. వంటగదిలో ఉండాలి. పిల్లల్ని కనాలి. ఇదే మీ పని అని చెబుతున్నారు. ఇది తమిళనాడు, ఇది ద్రావిడనాడు. డీఎంకే వ్యవస్థాపకులు అన్నాదురై, డీఎంకే పితామహుడు కరుణానిధి, సీఎం స్టాలిన్‌ల గడ్డ. ఇక్కడ మీ(మహిళల) ప్రగతే తమిళనాడు ప్రగతి’ అన్నారు.