Darbhanga Maharani: చైనాతో యుద్ధం వేళ 600 కిలోల బంగారమిచ్చిన దర్భంగ మహారాణి కామసుందరి కన్నుమూత
ABN , Publish Date - Jan 17 , 2026 | 04:57 AM
అసమాన్య దేశభక్తి, త్యాగం, సేవకు ప్రతిరూపంగా నిలిచిన దర్భంగ మహారాణి కామసుందరీ దేవి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. 93వ ఏట బిహార్‌లోని...
న్యూఢిల్లీ, జనవరి 16: అసమాన్య దేశభక్తి, త్యాగం, సేవకు ప్రతిరూపంగా నిలిచిన దర్భంగ మహారాణి కామసుందరీ దేవి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. 93వ ఏట బిహార్‌లోని దర్భంగలో చారిత్రక కళ్యాణి ప్యాల్‌సలో సోమవారం తుదిశ్వాస విడిచారు. దర్భంగ రాజ్యంలో చివరి రాణి అయిన ఆమె మరణంతో గొప్పదైన ఓ రాజవంశ శకం ముగిసినట్లయింది. 1962 భారత్, చైనా యుద్ధ సమయంలో కామసుందరీ దేవి దేశ రక్షణ కోసం 15మణుగులు(సుమారు 600 కిలోలు) బంగారాన్ని విరాళంగా ఇచ్చారు. మూడు ప్రైవేట్ విమానాలను, 90 ఎకరాల ఎయిర్‌స్ట్రిప్‌ను దేశం కోసం త్యాగం చేశారు. తర్వాత కాలంలో ఆ ఎయిర్‌స్ర్టిప్ కేంద్రం దర్భంగ విమానాశ్రయంగా మారింది. విద్యాభివృద్ధికి, పరిశ్రమల కోసం దర్భంగ రాజవంశం ఎన్నో విరాళాలు అందజేసింది. 1932లో జన్మించిన కామసుందరీ దేవి తన 8వ ఏట దర్భంగ మహారాజు కామేశ్వర్ సింగ్‌ను వివాహం చేసుకున్నారు. 1962లో ఆయన కన్నుమూశారు. ఆయనకు సంతానం లేకపోవడంతో కామసుందరీదేవి రాజకుటుంబ బాధ్యతలు నిర్వహించారు.