Share News

అప్రమత్తం చేసే నగారా.. ‘మురసు’

ABN , Publish Date - Nov 02 , 2026 | 02:07 AM

బంగాళాఖాతంలో ప్రస్తుతం ఏర్పడిన తుఫాన్‌కు ‘మురసు’ అని పేరుపెట్టారు. ఇది భారత్‌ పెట్టిన పేరు. హిందూ మహా సముద్ర ప్రాంతంలో తుఫానులను సులభంగా గుర్తించడానికి కొన్నేళ్లుగా ప్రత్యేకమైన..

అప్రమత్తం చేసే నగారా.. ‘మురసు’

బంగాళాఖాతంలో ప్రస్తుతం ఏర్పడిన తుఫాన్‌కు ‘మురసు’ అని పేరుపెట్టారు. ఇది భారత్‌ పెట్టిన పేరు. హిందూ మహా సముద్ర ప్రాంతంలో తుఫానులను సులభంగా గుర్తించడానికి కొన్నేళ్లుగా ప్రత్యేకమైన పేర్లు పెట్టే విధానాన్ని అనుసరిస్తున్నారు. ఈ ప్రాంతంలోని దేశాలన్నీ ముందుగానే ఈ పేర్లను సూచిస్తాయి. వాటిని వరుసగా తుఫానులకు పెడుతుంటారు. ఈ క్రమంలోనే గత నెల ఏర్పడిన తుఫానుకు బంగ్లాదేశ్‌ సూచించిన ‘అర్ణబ్‌’గా పేరుపెట్టారు. తర్వాత క్రమంలో తాజా తుఫానుకు భారత్‌ సూచించిన ‘మురసు’ పేరుపెట్టారు. ‘మురసు’ అనేది తమిళ పదం. డప్పు తరహాలోని పెద్ద నగారా, భేరి అని దీనికి అర్థం. ప్రాచీన తమిళ రాజ్యాల్లో యుద్ధ ప్రకటనలు, విజయోత్సవాలు, రాజుల ఆజ్ఞలను ప్రజలకు తెలియజేయడానికి ‘మురసు’ను మోగించేవారు. తుఫాను విషయంలో ప్రజలను అప్రమత్తం చేయడానికి వీలుగా ఈ పేరును భారత్‌ ప్రతిపాదించింది. ఈ క్రమంలో తర్వాత వచ్చే తుఫానులకు అక్వాన్‌ (ఇరాన్‌ సూచించిన పేరు), కాని (మాల్దీవులు), ఎన్‌గమన్‌(ఒమన్‌), సెయిల్‌ (ఒమన్‌), సాహబ్‌ (పాకిస్థాన్‌)గా నామకరణం చేస్తారు. తన వంతు వచ్చినప్పుడు భారత్‌ సూచించిన పేర్లలో.. ఆగ్‌, వ్యోమ్‌, ఝర్‌, ప్రోబహో, నీర్‌, ప్రభంజన్‌, ఘుర్ని, అంబుద్‌, జలధి, వెగా.. తదితర పేర్లు ఉన్నాయి.

- సెంట్రల్‌ డెస్క్‌

Updated Date - Nov 02 , 2026 | 02:10 AM