సీయూఈటీ-యూజీ ఫలితాలు విడుదల
ABN , Publish Date - Jun 24 , 2026 | 03:30 AM
కేంద్ర, రాష్ట్ర, ఎంపిక చేసిన ప్రైవేటు యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ స్థాయి సీయూఈటీ..
న్యూఢిల్లీ, జూన్ 23: కేంద్ర, రాష్ట్ర, ఎంపిక చేసిన ప్రైవేటు యూనివర్సిటీల్లో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ స్థాయి సీయూఈటీ(యూజీ)-2026 పరీక్ష ఫలితాలు ఎన్టీఏ మంగళవారం విడుదల చేసింది. ఒక అభ్యర్థి ఎంపిక చేసుకున్న ఐదు సబ్జెక్టులకుగానూ నాలుగింటిలో 100 పర్సంటైల్ సాధించి అత్యుత్తమ ప్రతిభ కనబరిచాడు. మరో 22 మంది అభ్యర్థులు వారు ఎంపిక చేసుకున్న సబ్జెక్టుల్లో మూడింటిలో, 180 మంది రెండు సబ్జెక్టుల్లో 100 పర్సంటైల్ సాధించారు. 3,214 మంది ఒక సబ్జెక్టులో వంద పర్సంటైల్ పొందినట్లు ఎన్టీఏ ఓ ప్రకటనలో వెల్లడించింది. మొత్తం పరీక్షలో మహిళా అభ్యర్థి టాపర్‌గా నిలిచింది. మహిళా విభాగంలో టాపర్ 1232.19 మార్కులు సాధించి అగ్రస్థానంలో నిలవగా.. పురుషుల విభాగంలో టాపర్‌కు 1230.82 మార్కులు వచ్చాయి. మొత్తం 11,64,098 మంది పరీక్ష రాశారు.