సీఆర్పీఎఫ్లో లాన్స్నాయక్లు.. నాయక్‌లు!
ABN , Publish Date - Oct 18 , 2026 | 06:10 AM
జవాన్లకు పదోన్నతులు కల్పించడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు సీఆర్పీఎఫ్ రంగం సిద్ధం చేస్తోంది. దాదాపు 30ఏళ్ల క్రితం రద్దుచేసిన లాన్స్ నాయక్..
30 ఏళ్ల క్రితం రద్దయిన హోదాలను మళ్లీ తెరపైకి తేనున్న సీఆర్పీఎఫ్
న్యూఢిల్లీ, అక్టోబరు 17: జవాన్లకు పదోన్నతులు కల్పించడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించేందుకు సీఆర్పీఎఫ్ రంగం సిద్ధం చేస్తోంది. దాదాపు 30ఏళ్ల క్రితం రద్దుచేసిన లాన్స్ నాయక్, నాయక్ హోదాలను తిరిగి ప్రవేశపెట్టాలని యోచిస్తోంది. 1997లో కేంద్ర హోంశాఖ ఆదేశాలతో లాన్స్ నాయక్, నాయక్ హోదాలను రద్దుచేసి, పోలీసు కానిస్టేబుల్, హెడ్ కానిస్టేబుల్ ర్యాంకుల్లో విలీనం చేశారు. ప్రస్తుతం 3.25 లక్షల మందికి పైగా సిబ్బంది ఉన్న సీఆర్పీఎ్ఫలో ఒక కానిస్టేబుల్‌కు తొలి పదోన్నతి లభించడానికి 25 ఏళ్ల వరకూ పడుతోంది. దీనిపై జవాన్లలో తీవ్ర అసంతృప్తి నెలకొంది. కొత్త ప్రతిపాదనలు అమలైతే కానిస్టేబుల్‌గా చేరిన జవాన్‌కు ఐదేళ్ల తర్వాత లాన్స్ నాయక్‌గా పదోన్నతి లభిస్తుంది. ఆ తర్వాత పదేళ్లకు నాయక్‌గా, 20ఏళ్లకు హెడ్‌కానిస్టేబుల్‌గా పదోన్నతి పొందుతారు.