విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు రాజకీయ దాడే
ABN , Publish Date - May 28 , 2026 | 03:54 AM
కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు బీజేపీ చేయించే రాజకీయ దాడేనని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు విజయరాఘవన్ విమర్శించారు.
హైదరాబాద్, మే 27(ఆంధ్ర జ్యోతి): కేరళ మాజీ సీఎం పినరయి విజయన్ ఇంట్లో ఈడీ సోదాలు బీజేపీ చేయించే రాజకీయ దాడేనని సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు విజయరాఘవన్ విమర్శించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలతో దాడులు చేయిస్తూ మోదీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేస్తోందన్నారు. హైదరాబాద్‌లో ఎంబీ భవన్‌లో విలేకరుల సమావేశంలో ఆయన పొలిట్‌బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులతో కలిసి మాట్లాడారు. ఆర్థిక నేరాలకు సంబంధించి సీపీఎం నేతలపై ఒక్క కేసు కూడా లేదన్నారు. కార్పొరేట్ సంస్థల నుంచి ఇతర పార్టీల మాదిరి ఎన్నికల బాండ్లు స్వీకరించలేదన్నారు. బీవీ రాఘవులు మాట్లాడుతూ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ముగిసిన వెంటనే ప్రతిపక్ష నేతలపై దాడులు మొదలు పెట్టారని విమర్శించారు. కాక్రోచ్ జనతా పార్టీ వెబ్‌సైట్లను, ఎక్స్ ఖాతాలను మూసివేయడాన్ని తప్పు పట్టారు.