Share News

అత్తమామలను పోషించడం కోడలి చట్టబద్ధ బాధ్యత కాదు: అలహాబాద్‌ హైకోర్టు

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:31 AM

అత్తమామలను పోషించాల్సిన చట్టబద్ధమైన బాధ్యత కోడలిపై లేదని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఆధారపడ్డవారిని పోషించడానికి...

అత్తమామలను పోషించడం కోడలి చట్టబద్ధ బాధ్యత కాదు: అలహాబాద్‌ హైకోర్టు

ప్రయాగ్‌రాజ్‌, మార్చి 29: అత్తమామలను పోషించాల్సిన చట్టబద్ధమైన బాధ్యత కోడలిపై లేదని అలహాబాద్‌ హైకోర్టు స్పష్టం చేసింది. ఆధారపడ్డవారిని పోషించడానికి ‘బీఎన్‌ఎ్‌సఎ్‌స’లోని సెక్షన్‌ 144లో కోడలిపై ఎలాంటి భారం పెట్టలేదని తెలిపింది. వృద్ధులను చూడాలన్న నైతిక బాధ్యతను చట్టబద్ధమైన విధిగా పరిగణించలేమని పేర్కొంది. ఉత్తరప్రదేశ్‌లో పోలీసు కానిస్టేబుల్‌గా పనిచేసిన ఓ వ్యక్తికి 2016లో వివాహం జరిగింది. 2021లో ఆయన మరణించాడు. ఆయన భార్య కూడా కానిస్టేబుల్‌గా పనిచేస్తోంది. కుమారుడిపై ఆధారపడి తాము జీవించేవారమని, ఆయన మరణంతో తాము దిక్కులేనివారమయ్యామని పేర్కొంటూ తల్లిదండ్రులు తొలుత ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. కుమారుడి మరణాంతరం వచ్చిన ఆర్థిక ప్రయోజనాలను కోడలే తీసుకుందని, అందువల్ల తమ పోషణను కూడా ఆమే చూసుకునేలా ఆదేశించాలని కోరారు. పోషించాల్సిన చట్టబద్ధమైన బాధ్యత కోడలిపై లేదంటూ వారి వినతిని ఫ్యామిలీ కోర్టు తిరస్కరించింది. ఆ వృద్ధ దంపతులు హైకోర్టులో అప్పీలు చేశారు.

Updated Date - Mar 30 , 2026 | 04:31 AM