వంటనూనెల ప్యాకింగ్ ఇక 9 ప్రామాణిక కొలతల్లో!
ABN , Publish Date - Jun 07 , 2026 | 06:03 AM
వంట నూనెలను కొనేటప్పుడు ఓ విషయం గమనించే ఉంటారు! లీటరు ప్యాకెట్‌పై నికర బరువు 910 గ్రాములు అనో, 800 గ్రాములు అనో రాసి ఉంటుంది.
లీటరు పేరుతో 910 గ్రాములు అంటగట్టే మాయాజాలానికి చెక్
న్యూఢిల్లీ, జూన్ 6: వంట నూనెలను కొనేటప్పుడు ఓ విషయం గమనించే ఉంటారు! లీటరు ప్యాకెట్‌పై నికర బరువు 910 గ్రాములు అనో, 800 గ్రాములు అనో రాసి ఉంటుంది. డబ్ములు మాత్రం పూర్తిగా లీటరు నూనెకు లెక్కగట్టి తీసుకుంటారు! వినియోగదారులను ఇలా బోల్తా కొట్టించే ధోరణి ఇకముందు చెల్లనే చెల్లదు. కంపెనీల మోసాలను అరికట్టేందుకు, ధరలను వినియోగదారులు తేలిగ్గా పోల్చుకునేందుకు వీలుగా వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ వంట నూనెల ప్యాకింగ్ పరిమాణాల పరంగా కొత్త నిబంధనలను తెచ్చింది. ఈ మేరకు ప్యాకింగ్ పరంగా తొమ్మిది ప్రామాణిక సైజులను ప్రవేశపెట్టింది. ఇక నుంచి 200 గ్రాములు, 500 గ్రాములు, లీటరు/కిలో, 2 లీటర్లు/2 కిలోలు, 3లీటర్లు/కిలోలు, 4లీటర్లు/కిలోలు, 5లీటర్లు/కిలోలు, 15లీటర్లు/కిలోలు, 20లీటర్లు/కిలోల పరిమాణంలో మాత్రమే ప్యాక్ చేయాల్సి ఉంటుంది. నూనె ప్యాకెట్‌పై పరిమాణాన్ని (వాల్యూమ్) లీటర్లలో లేదా మిల్లీ లీటర్లలో ముద్రిస్తే నిబంధనల ప్రకారం దానికి సమానమైన బరువు (వెయిట్)ను కూడా స్పష్టంగా ముద్రించాల్సి ఉంటుంది. ఈ కొత్త నిబంధనలను అమలు చేసేందుకు తయారీదారులకు, దిగుమతిదారులకు మూడు నెలల సమయం ఇచ్చారు. కాగా 200 గ్రాముల కన్నా తక్కువ ఉండే చిన్న ప్యాకెట్లకు ఈ నిబంధనల నుంచి మినహాయింపునిచ్చారు. కొత్త నిబంధనలను ఇండియన్ వెజిటెబుల్