Share News

శారీరక సంబంధానికి అంగీకరిస్తే.. వేధింపులకు అనుమతి ఇచ్చినట్లు కాదు

ABN , Publish Date - Feb 05 , 2026 | 03:39 AM

ఓ మహిళ శారీరక సంబంధానికి అంగీకరిస్తే వీడియోలు తీసి, వాటిని ఆన్‌లైన్‌లో పెట్టి వేధించడానికి అనుమతి తెలిపినట్లు ఎంతమాత్రం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది.

శారీరక సంబంధానికి అంగీకరిస్తే.. వేధింపులకు అనుమతి ఇచ్చినట్లు కాదు

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: ఓ మహిళ శారీరక సంబంధానికి అంగీకరిస్తే వీడియోలు తీసి, వాటిని ఆన్‌లైన్‌లో పెట్టి వేధించడానికి అనుమతి తెలిపినట్లు ఎంతమాత్రం కాదని ఢిల్లీ హైకోర్టు స్పష్టం చేసింది. ఓ మహిళను లైంగికంగా వేధించి, బెదిరింపులకు పాల్పడిన కేసులో నిందితుడి బెయిల్‌ విచారణ సందర్భంగా కోర్టు ఆ వ్యాఖ్యలు చేసింది. పరస్పర అంగీకారంతోనే తమ మధ్య సంబంధం కొనసాగిందని నిందితుడు చెప్పడాన్ని కోర్టు తప్పుబట్టింది. అంగీకారం ఉన్నా లైంగిక దాడులు చేస్తే చట్టప్రకారం తప్పుకాకుండా పోదని స్పష్టం చేసింది. శారీరక సంబంధానికి గతంలో అంగీకరించినంత మాత్రాన భవిష్యత్‌లో భాగస్వామి చేసే పనులన్నింటికీ లైసెన్సు ఇచ్చినట్లు కాదంది. వీడియోల ద్వారా బలవంతం చేస్తే అది ఏకాభిప్రాయం కిందకురాదంది. నిందితుడు తనను లైంగికంగా వేధించి, తమ ఏకాంత వీడియోలను సోషల్‌ మీడియాలో పెట్టాడంటూ ఢిల్లీకి చెందిన ఓ వివాహిత ఫిర్యాదు చేయగా, 2024లో కేసు నమోదైంది.

Updated Date - Feb 05 , 2026 | 03:39 AM