Share News

మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన సిగ్గుచేటు: కాంగ్రెస్‌

ABN , Publish Date - Mar 01 , 2026 | 03:03 AM

ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ పర్యటనపై కాంగ్రెస్‌ పార్టీ నిశిత విమర్శలు చేసింది. ఈ పర్యటనను సిగ్గుచేటుగా పేర్కొంది.

మోదీ ఇజ్రాయెల్‌ పర్యటన సిగ్గుచేటు: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 28: ప్రధాని మోదీ ఇజ్రాయెల్‌ పర్యటనపై కాంగ్రెస్‌ పార్టీ నిశిత విమర్శలు చేసింది. ఈ పర్యటనను సిగ్గుచేటుగా పేర్కొంది. ఇజ్రాయెల్‌లో పర్యటించిన సమయం కూడా సరికాదని వ్యాఖ్యానించింది. ఇది సైనికచర్యకు రాజకీయ ఆమోదం ఉందన్న భావనను కల్పించేలా ఉందని దుయ్యబట్టింది. ఈ మేరకు కాంగ్రెస్‌ పార్టీ విదేశీ వ్యవహారాల విభాగం చైర్మన్‌ సల్మాన్‌ ఖుర్షీద్‌ శనివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్తతల వేళ మోదీ చేసిన పర్యటనపై కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర ఆందోళన చెందుతోందని తెలిపారు. కాగా, మోదీ ఫిబ్రవరి 25, 26 తేదీల్లో ఇజ్రాయెల్‌లో పర్యటించారు.

Updated Date - Mar 01 , 2026 | 03:04 AM