శాంతియుత అసమ్మతి నేరం కాదు: కాంగ్రెస్
ABN , Publish Date - Feb 24 , 2026 | 04:17 AM
యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టులు, నిర్బంధాన్ని కాంగ్రెస్ ఖండించింది. తమ కార్యకర్తలపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేసింది..
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 23: యూత్ కాంగ్రెస్ కార్యకర్తల అరెస్టులు, నిర్బంధాన్ని కాంగ్రెస్ ఖండించింది. తమ కార్యకర్తలపై వేధింపులు ఆపాలని డిమాండ్ చేసింది. శాంతియుతంగా అసమ్మతి వ్యక్తం చేయడం నేరం, ముప్పు కాదని పేర్కొంది. పార్టీకి చెందిన పలువురు ఎంపీలు సోమవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఏఐ సదస్సులో నిరసన ఘటనలో పోలీసు చర్యలు ఎదుర్కొంటున్న యూత్ కాంగ్రెస్ కార్యకర్తలకు సంఘీభావం ప్రకటించారు. ‘ఢిల్లీ పోలీసులు ఐవైసీ అధ్యక్షుడు, కార్యకర్తలను నిర్బంధించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. నిరసనలు ప్రజాస్వామ్యానికి గుండెకాయ. ఎంతమాత్రం నేరం కాబోదనే విషయాన్ని ఈ ప్రభుత్వం మర్చిపోతోంది’ అని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు.