Suresh Kalmadi Passes Away: కాంగ్రెస్ నేత సురేశ్ కల్మాడీ కన్నుమూత
ABN , Publish Date - Jan 07 , 2026 | 02:22 AM
కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ(81) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు.
న్యూఢిల్లీ, జనవరి 6: కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి సురేశ్ కల్మాడీ(81) కన్నుమూశారు. కొంతకాలంగా ఆయన అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. పుణెలోని ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం 3.30గంటలకు చనిపోయారు. సురేశ్ కల్మాడీ పీవీ ప్రభుత్వంలో రైల్వే శాఖ సహాయ మంత్రిగా పనిచేశారు. 1996-2011 మధ్యలో భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా, ఆ తర్వాత కామన్వెల్త్ క్రీడల నిర్వాహక కమిటీ చైర్మన్‌గా కూడా బాధ్యతలు నిర్వహించారు. కల్మాడీ ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఉన్న సమయంలోనే భారత్‌లో ప్రతిష్ఠాత్మక ఆఫ్రో ఆసియా గేమ్స్(2003), కామన్వెల్త్ యూత్ గేమ్స్(2008), కామన్వెల్త్ గేమ్స్(2010), ఆసియాన్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ పోటీలను(1989,2013) నిర్వహించారు. ఆ సమయంలోనే కామన్వెల్త్ క్రీడల్లో అవినీతి జరిగిందన్న ఆరోపణలొచ్చాయి. కల్మాడీని అరెస్టు కూడా చేశారు. అయితే, తర్వాత ఈడీ ఆయనకు క్లీన్ చిట్ ఇచ్చింది. కల్మాడీ అంతకుముందు 1964-1972మధ్యలో వాయుసేనలో పైలట్‌గా పనిచేశారు. కల్మాడీ 1944లో మద్రాసులో జన్మించారు. 1980ల్లో రాజకీయాల్లోకి వచ్చారు. 4సార్లు రాజ్యసభకు, 3సార్లు లోక్‌సభకు ఎన్నికయ్యారను.