విద్యార్థుల కోసం కాంగ్రెస్ పోరు బాట
ABN , Publish Date - Jun 14 , 2026 | 03:46 AM
ఎన్డీయే ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, నిరుద్యోగ సమస్య, పరీక్షల నిర్వహణలో అక్రమాలపై పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది.
న్యూఢిల్లీ, జూన్ 13(ఆంధ్రజ్యోతి): ఎన్డీయే ప్రభుత్వ హయాంలో జరుగుతున్న ప్రశ్నపత్రాల లీకేజీలు, నిరుద్యోగ సమస్య, పరీక్షల నిర్వహణలో అక్రమాలపై పోరాడేందుకు కాంగ్రెస్ సిద్ధమైంది. పరీక్షల నిర్వహణ వైఫల్యాలకు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలనే ప్రధాన డిమాండ్‌తో దేశవ్యాప్త నిరసనలకు నడుం బిగించింది. పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆధ్వర్యంలో తొలి దశలో నాలుగు భారీ విద్యార్థి సదస్సులు నిర్వహించనుంది. ఈ నెల 17న కోటా, వచ్చే నెల 10న అలహాబాద్, 11న పట్నా, 14న ఢిల్లీలో కాంగ్రెస్ సదస్సులను నిర్వహించనుంది.