Share News

Minister Sitaakka: నరేగా బచావో సంగ్రామ్‌ సమన్వయ కమిటీలో సీతక్క

ABN , Publish Date - Jan 05 , 2026 | 02:23 AM

మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ పార్టీ ‘నరేగా బచావో సంగ్రామ్‌’ పేరుతో ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసింది.

Minister Sitaakka: నరేగా బచావో సంగ్రామ్‌ సమన్వయ కమిటీలో సీతక్క

  • 9 మందితో కమిటీ ఏర్పాటు

న్యూఢిల్లీ, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) పరిరక్షణ కోసం కాంగ్రెస్‌ పార్టీ ‘నరేగా బచావో సంగ్రామ్‌’ పేరుతో ఉద్యమ కార్యాచరణను సిద్ధం చేసింది. ఈ నిరసన కార్యక్రమాల అమలు పర్యవేక్షణకు తొమ్మిది మందితో సమన్వయ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ కన్వీనర్‌గా రాజ్యసభ సభ్యుడు అజయ్‌ మాకెన్‌ను నియమించింది. కాంగ్రెస్‌ అధిష్ఠానం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావిస్తున్న ఈ కమిటీలో తెలంగాణ నుంచి మంత్రి సీతక్కకు అవకాశం కల్పించారు. ఇతర సభ్యులుగా జైరాం రమేశ్‌, సందీప్‌ దీక్షిత్‌, డాక్టర్‌ ఉదిత్‌ రాజ్‌, ప్రియాంక్‌ ఖర్గే, దీపికా పాండే సింగ్‌, డాక్టర్‌ సునీల్‌ పన్వార్‌, మనీశ్‌ శర్మ ఉన్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఖర్గే ఆమోదం మేరకు ఈ ఆదేశాలు తక్షణమే అమల్లోకి వస్తాయని కాంగ్రెస్‌ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ ప్రకటించారు.

Updated Date - Jan 05 , 2026 | 02:23 AM