ఒమన్ తీరంలో వాణిజ్య నౌకపై దాడి
ABN , Publish Date - Sep 14 , 2026 | 06:22 AM
ఒమన్ దేశ తీర ప్రాంతానికి సమీపంలో 14 మంది భారత సిబ్బందితో వెళ్తున్న ఓ వాణిజ్య నౌకపై ఆదివారం దాడి జరిగింది. ఈ ఘటనలో 13 మందిని కాపాడగా.. ఒకరు గల్లంతయ్యారని కేంద్రం తెలిపింది.
14 మంది భారత సిబ్బందిలో ఒకరు గల్లంతు
న్యూఢిల్లీ, సెప్టెంబరు 13: ఒమన్ దేశ తీర ప్రాంతానికి సమీపంలో 14 మంది భారత సిబ్బందితో వెళ్తున్న ఓ వాణిజ్య నౌకపై ఆదివారం దాడి జరిగింది. ఈ ఘటనలో 13 మందిని కాపాడగా.. ఒకరు గల్లంతయ్యారని కేంద్రం తెలిపింది. గల్లంతైన వ్యక్తి కోసం రెస్క్యూ కొనసాగుతోందని వెల్లడించింది. ఆ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు చర్చలు, దౌత్య మార్గాలను అనుసరించాలని మరోసారి పిలుపునిచ్చింది. ఆ నౌకను ఎంటీ ఎల్ గైయాగా గుర్తించామని.. ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని విదేశాంగ శాఖ పేర్కొంది. వాణిజ్య నౌకలు, నావికులు, పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.