హోటళ్లకు ఇక ఫుల్ వంటగ్యాస్
ABN , Publish Date - Jun 26 , 2026 | 03:48 AM
హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య అవసరాలకు వంటగ్యాస్ సరఫరాపై ఉన్న ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. అమెరికా-ఇరాన్ సైనిక ఘర్షణ కారణంగా దిగుమతుల్లో ...
వాణిజ్య ఎల్పీజీ సరఫరాపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం
న్యూఢిల్లీ, జూన్ 25: హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య అవసరాలకు వంటగ్యాస్ సరఫరాపై ఉన్న ఆంక్షలను కేంద్రం ఎత్తివేసింది. అమెరికా-ఇరాన్ సైనిక ఘర్షణ కారణంగా దిగుమతుల్లో ఇబ్బందులు తలెత్తటంతో గృహ వినియోగదారులకు కొరత రాకుండా చూసేందుకు వాణిజ్య అవసరాలకు ఎల్పీజీ సరఫరాపై కేంద్రం గతంలో ఆంక్షలు విధించిన విషయం తెలిసిందే. పరిశ్రమలకు నాడు ఎల్పీజీ సరఫరాను పూర్తిగా నిలిపివేసింది. తాజాగా దేశీయంగా ఉత్పత్తి పెరగటంతోపాటు పర్షియన్ గల్ఫ్ నుంచి ఎల్పీజీ ట్యాంకర్లు మనదేశానికి వస్తుండటంతో హోటళ్లు, రెస్టారెంట్లకు సరఫరాను యుద్ధం పూర్వపు స్థితికి పునరుద్ధరిస్తున్నట్లు పెట్రోలియం శాఖ గురువారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.