Share News

రూ.10 పెరిగిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర

ABN , Publish Date - Nov 02 , 2026 | 02:52 AM

దీపావళి వేళ వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరిగాయి. 19కిలోల ఎల్‌పీజీ వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.10 మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి.

రూ.10 పెరిగిన వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర

న్యూఢిల్లీ, నవంబరు 1: దీపావళి వేళ వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరలు పెరిగాయి. 19కిలోల ఎల్‌పీజీ వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను రూ.10 మేర పెంచుతూ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో వరుసగా రెండో నెల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను పెంచినట్టు అయింది. చమురు సంస్థలు వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధరను అక్టోబరు 1న రూ.62.50పైసలు మేర పెంచాయి. దాంతో హైదరాబాద్‌లో సెప్టెంబరులో రూ.2,996గా ఉన్న 19 కిలోల వాణిజ్య గ్యాస్‌ సిలిండర్‌ ధర అక్టోబరు 1న రూ.3,065కి పెరిగింది. ఇప్పుడు మరో రూ.10 పైగానే భారం పడనుంది. మరోపక్క, ఏటీఎ్‌ఫ(ఏవియేషన్‌ టర్బైన్‌ ఫ్యుయల్‌) ధర లీటరుకు రూ.1.37 పైసలు మేర చమురు సంస్థలు పెంచాయి.

Updated Date - Nov 02 , 2026 | 02:55 AM