Share News

కొలంబియాలో కూలిన సైనిక విమానం

ABN , Publish Date - Mar 24 , 2026 | 04:46 AM

కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 110 మంది సైనికులతో బయల్దేరిన ఓ సైనిక విమానం...

కొలంబియాలో కూలిన సైనిక విమానం

  • విమానంలో 110 మంది సైనికులు..

న్యూఢిల్లీ, మార్చి 23: కొలంబియాలో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. సుమారు 110 మంది సైనికులతో బయల్దేరిన ఓ సైనిక విమానం (సీ-130 హెర్క్యూలెస్‌) టేకాఫ్‌ అయిన కొద్దిసేపటికే నియంత్రణ కోల్పోయి ఓ అటవీ ప్రాంతంలో కుప్పకూలింది. ఈక్వడార్‌ సరిహద్దు ప్రాంతంలో సోమవారం ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో విమానంలో ఉన్న సైనికులందరూ మృతి చెందినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో భారీగా మంటలు ఎగిసిపడుతున్నాయి.

Updated Date - Mar 24 , 2026 | 04:46 AM