ఇన్‌స్టాగ్రాం ఖాతా స్తంభనపై సుప్రీంకు ‘కాక్రోచ్’
ABN , Publish Date - May 27 , 2026 | 03:59 AM
తమ ఇన్‌స్టాగ్రాం, ఎక్స్ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం స్తంభిపజేయడాన్ని సవాలు చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిషీత్...
న్యూఢిల్లీ, మే 26: తమ ఇన్‌స్టాగ్రాం, ఎక్స్ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం స్తంభిపజేయడాన్ని సవాలు చేస్తూ కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) వ్యవస్థాపకుడు అభిషీత్ దీప్కే సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ప్రభుత్వ విధానాలపై వ్యంగ్య బాణాలు విసురుతూ సామాజిక మాధ్యమాల్లో ఆయన చేపట్టిన ఉద్యమం వైరల్‌గా మారడంతో అది పార్టీగా అవతరించింది. కొద్ది రోజుల వ్యవధిలోనే ఇన్‌స్టాగ్రాంలో 1.90 కోట్ల మంది ఫాలోయర్లను సంపాదించింది. అనంతరం జాతీయ భద్రత దృష్ట్యా ఆ పార్టీ సామాజిక మాధ్యమ ఖాతాలను ప్రభుత్వం ఈ నెల 21న నిలుపుదల చేసింది. తన వ్యక్తిగత ఖాతాలను కూడా స్తంభింపజేసిందని దీప్కే పేర్కొన్నారు. దీన్ని సవాలు చేస్తూ దీప్కే కోర్టును ఆశ్రయించారు