సగానికి పైగా థర్మల్ కేంద్రాల్లో బొగ్గు కొరత
ABN , Publish Date - Oct 22 , 2026 | 04:33 AM
దేశంలో ఎల్‌నినో కారణంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్న సమయంలో థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు కొరత ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని మొత్తం 191 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో..
న్యూఢిల్లీ, అక్టోబరు 21: దేశంలో ఎల్‌నినో కారణంగా విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతున్న సమయంలో థర్మల్ విద్యుదుత్పత్తి కేంద్రాల్లో బొగ్గు కొరత ఆందోళన కలిగిస్తోంది. దేశంలోని మొత్తం 191 థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో సగానికి పైగా(96) కేంద్రాల్లో బొగ్గు నిల్వలు ప్రమాదకర స్థాయికి పడిపోయాయని కేంద్ర విద్యుత్ ప్రాధికార సంస్థ (సీఈఏ) గణాంకాలు వెల్లడించాయి. సెప్టెంబరులో ఆ సంఖ్య 60 ఉండగా, ఒక్కనెల వ్యవధిలోనే గణనీయంగా పెరిగింది. కేంద్ర ప్రభుత్వం థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాను పెంచుతున్నప్పటికీ అక్టోబరులో సుమారు 5 శాతం నిల్వలు తగ్గినట్లు సీఈఏ గణాంకాలు పేర్కొన్నాయి.