సీజేపీ ఉద్యమానికి తాత్కాలిక విరామం
ABN , Publish Date - Oct 22 , 2026 | 04:25 AM
సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ తాము చేస్తున్న పోరాటాలకు పండుగల నేపథ్యంలో తాత్కాలిక విరామం ఇస్తున్నామని సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే వెల్లడించారు.
పండగ నేపథ్యంలో దీప్కే నిర్ణయం
అశుతోశ్, సౌరవ్లే అసలైన నాయకులని వెల్లడి
న్యూఢిల్లీ, అక్టోబరు 21: సీఈసీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ తాము చేస్తున్న పోరాటాలకు పండుగల నేపథ్యంలో తాత్కాలిక విరామం ఇస్తున్నామని సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే వెల్లడించారు. పండుగల వేళ కాక్రోచ్‌లంతా తమ కుటుంబాలతో సంతోషంగా గడపాలని పిలుపునిచ్చారు. అంతేకాక,. సీజేపీ అధికార ప్రతినిధులు అశుతోశ్ రంకా, సౌరవ్ దాస్ సీజేపీ అసలైన నాయకులని, ఇప్పటివరకు వారి ఆదేశాలనే తాను పాటిస్తున్నానని దీప్కే పేర్కొన్నారు. ఈ మేరకు ఓ వీడియో సందేశం విడుదల చేశారు. ఫ్రాన్స్‌లో జరుగుతున్న ఆందోళనలు, బంగ్లాదేశ్, నేపాల్‌లో జరిగిన ఘటనలతో సీజేపీ నిరసనలకు పోలిక పెడుతున్న వారు సిగ్గు పడాలని దీప్కే ఎద్దేవా చేశారు. సీజేపీ పోరాటాలకు ప్రధాన బలం శాంతి అని తెలిపారు.