Share News

సౌరవ్‌, అశుతోష్‌ విడుదల

ABN , Publish Date - Oct 22 , 2026 | 04:21 AM

సీజేపీ నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకా.. తిహార్‌ జైలు నుంచి బుధవారం రాత్రి విడుదలయ్యారు. జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనలకు ప్రభుత్వం తిరిగి అనుమతిచ్చే వరకు ఆ ప్రాంతంలో..

సౌరవ్‌, అశుతోష్‌ విడుదల

  • జంతర్‌మంతర్‌లో ఆందోళనలు చెయ్యమని హామీ ఇవ్వడంతోనే..

సీజేపీ నేతలు సౌరవ్‌ దాస్‌, అశుతోష్‌ రంకా.. తిహార్‌ జైలు నుంచి బుధవారం రాత్రి విడుదలయ్యారు. జంతర్‌మంతర్‌ వద్ద ఆందోళనలకు ప్రభుత్వం తిరిగి అనుమతిచ్చే వరకు ఆ ప్రాంతంలో ఎలాంటి నిరసన ప్రదర్శనలు చేపట్టమని సౌరవ్‌, అశుతోష్‌ లిఖితపూర్వక హామీ ఇచ్చారు. అలాగే రూ.50వేల చొప్పున పూచీకత్తు బాండ్లు సమర్పించారు. దీంతో స్పెషల్‌ ఎగ్జిక్యూటివ్‌ మేజిస్ట్రేట్‌ (ఎస్‌ఈఎం) వారి విడుదలకు ఆదేశాలు చేశారు. ఈ నెల 14న ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద అనుమతి లేకుండా నిరసనలు చేసిన కేసులో వారిని అరెస్టు చేయగా ఎస్‌ఈఎం..7 రోజుల పాటు జ్యుడీషియల్‌ రిమాండ్‌కు పంపిన సంగతి తెలిసిందే.

Updated Date - Oct 22 , 2026 | 04:22 AM