Share News

పర్యావరణ వాదులపై సీజేఐ వ్యాఖ్యలు ఆందోళనకరం

ABN , Publish Date - May 24 , 2026 | 04:07 AM

పర్యావరణ వాదులపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పౌరులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ..

పర్యావరణ వాదులపై సీజేఐ వ్యాఖ్యలు ఆందోళనకరం

  • 71 మంది విశ్రాంత అధికారుల బహిరంగ లేఖ

న్యూఢిల్లీ, మే 23: పర్యావరణ వాదులపై సీజేఐ జస్టిస్‌ సూర్యకాంత్‌ ఇటీవల చేసిన వ్యాఖ్యలు పౌరులను భయభ్రాంతులకు గురిచేసేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేస్తూ.. అఖిల భారత సర్వీసులు, కేంద్ర సర్వీసులకు చెందిన 71 మంది విశ్రాంత అధికారులు ఆయనకు బహిరంగ లేఖ రాశారు. గుజరాత్‌లోని పిపావావ్‌ పోర్టు విస్తరణ ప్రాజెక్టుకు ఇచ్చిన పర్యావరణ అనుమతులను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ విచారణ సందర్భంగా.. ‘భారత్‌లో పర్యావరణ కార్యకర్తలు స్వాగతం చెప్పిన ఏ ఒక్క ప్రాజెక్టునైనా చూపగలరా?’ అని సీజేఐ వ్యాఖ్యానించారు. ఇలాంటి వ్యాఖ్యలు దేశ అత్యున్నత న్యాయమూర్తి నుంచి వెలువడటం ఆందోళనకరమని రాజ్యాంగ ప్రవర్తనా మండలి(సీసీజీ) పేరిట విడుదల చేసిన లేఖలో అధికారులు అన్నారు.

Updated Date - May 24 , 2026 | 04:07 AM