Share News

అఫిడవిట్లలో నిజాలు దాచిన అభ్యర్థులపై పౌరులూ ఫిర్యాదు చేయొచ్చు

ABN , Publish Date - Oct 17 , 2026 | 04:50 AM

ఎన్నికల అఫిడవిట్లలో అవాస్తవాలు వెల్లడించడం లేదా వాస్తవాలను దాచి ఎన్నికైన అభ్యర్థులపై ప్రైవేటు వ్యక్తులు(పౌరులు) కూడా నేరారోపణలు(క్రిమినల్‌ కంప్లెయింట్స్‌) చేయవచ్చని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది.

అఫిడవిట్లలో నిజాలు దాచిన అభ్యర్థులపై పౌరులూ ఫిర్యాదు చేయొచ్చు
SUPREMECOURT

న్యూఢిల్లీ, అక్టోబరు 16: ఎన్నికల అఫిడవిట్లలో అవాస్తవాలు వెల్లడించడం లేదా వాస్తవాలను దాచి ఎన్నికైన అభ్యర్థులపై ప్రైవేటు వ్యక్తులు(పౌరులు) కూడా నేరారోపణలు(క్రిమినల్‌ కంప్లెయింట్స్‌) చేయవచ్చని సుప్రీం కోర్టు శుక్రవారం స్పష్టం చేసింది. అలాంటి సందర్భంలో సీఆర్‌పీసీ సెక్షన్‌ 195 కింద ఉన్న నిబంధన అడ్డు కాబోదని జస్టిస్‌ దీపాంకర్‌ దత్తా, జస్టిస్‌ షీల్‌ నాగుల బెంచ్‌ పేర్కొంది. సంబంధిత కోర్టు లేదా తగిన అధికారం గల అధికారి కేసు నమోదు చేసి ఉంటే తప్ప కొన్ని నిర్దిష్టమైన నేరాల విషయంలో క్రిమినల్‌ కోర్టులు నేరుగా విచారణ చేపట్టలేవని సీఆర్‌పీసీ సెక్షన్‌ 195 పేర్కొంటుంది. అయితే ప్రజాప్రాతినిధ్య చట్టం సెక్షన్‌ 125ఏ కింద నేరానికి పాల్పడినట్లు పేర్కొంటూ ప్రైవేటు ఫిర్యాదు దాఖలు చేసినప్పుడు ఈ నిబంధన వర్తించదని సుప్రీంకోర్టు బెంచ్‌ స్పష్టం చేసింది.

Updated Date - Oct 17 , 2026 | 04:50 AM