Share News

అనుమానాలను ఈసీ నివృత్తి చేయాలి

ABN , Publish Date - Sep 26 , 2026 | 05:06 AM

సర్‌’ ప్రక్రియపై ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాలని కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్‌ పేర్కొన్నారు.

అనుమానాలను ఈసీ  నివృత్తి చేయాలి
chirag

  • కేంద్ర మంత్రి చిరాగ్‌ పాసవాన్‌

పట్నా, సెప్టెంబరు 25: ‘సర్‌’ ప్రక్రియపై ఎన్నికల కమిషనర్ల మధ్య విభేదాలు ఉన్నాయన్న వార్తల నేపథ్యంలో ప్రజల్లో నెలకొన్న అనుమానాలను ఎన్నికల సంఘం నివృత్తి చేయాలని కేంద్ర మంత్రి, ఎల్‌జేపీ అధ్యక్షుడు చిరాగ్‌ పాసవాన్‌ పేర్కొన్నారు. ప్రజల్లో ఎన్నికల వ్యవస్థపై విశ్వాసం సన్నగిల్లడం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని వ్యాఖ్యానించారు. శుక్రవారం బిహార్‌లోని పట్నాలో ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ప్రభుత్వంలో భాగంగా ఉన్న నేను రాజ్యాంగబద్ధ సంస్థను పూర్తిగా సమర్థించాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షం ఎప్పుడూ తనకు రాజకీయంగా అనుకూలమైన వైఖరినే తీసుకుంటుంది. అందువల్ల రాహుల్‌ గాంధీ, ఇతర నేతల ఆరోపణలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. రాహుల్‌గాంధీ, ఆయ న సహచరుల ఆరోపణలకు ఈసీ సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేకపోయినా.. ప్రజల్లో ఏ ర్పడిన అనుమానాలను మాత్రం నివృత్తి చేయాలి. స్పష్టంగా వివరణ ఇవ్వాలనేది నా అభిప్రాయం’’ అని ఆయన పేర్కొన్నారు.

Updated Date - Sep 26 , 2026 | 05:06 AM