Share News

నేటి నుంచి కేంద్ర మంత్రుల చింతన్‌ శిబిర్‌!

ABN , Publish Date - Sep 23 , 2026 | 05:30 AM

కేంద్ర మంత్రుల చింతన్‌ శిబిర్‌కు రంగం సిద్ధమైంది. బుధ, గురువారాల్లో ప్రధానమంత్రి కార్యాలయానికి నెలవైన ‘సేవాతీర్థ్‌’లో ప్రధా ని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది.

నేటి నుంచి కేంద్ర మంత్రుల   చింతన్‌ శిబిర్‌!
pm

సేవాతీర్థ్‌’లో రెండ్రోజులపాటు సమావేశం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 22: కేంద్ర మంత్రుల చింతన్‌ శిబిర్‌కు రంగం సిద్ధమైంది. బుధ, గురువారాల్లో ప్రధానమంత్రి కార్యాలయానికి నెలవైన ‘సేవాతీర్థ్‌’లో ప్రధా ని మోదీ అధ్యక్షతన ఈ సమావేశం జరుగనుంది. ప్రధానంగా వికసిత్‌ భారత్‌ విజన్‌-2047, సంస్కరణలతో పాటు పరిపాలన, విధాన నిర్ణయాలకు సంబంధించిన కీలకాంశాలపై ఇక్కడ చర్చ జరుగుతుందని అధికార వర్గాలు తెలిపాయి. కేంద్ర మంత్రులందరూ దీనికి హాజరుకానున్నారు. ప్రభుత్వంలో ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమాల సమీక్ష, తదుపరి ఆలోచనల గుర్తింపు, భావి ప్రణాళికల రూపకల్పన, వికసిత్‌ భారత్‌-2047 లక్ష్య సాధన దిశగా సంస్కరణలు, ప్రాథమ్యాలపై ఈ భేటీలో దృష్టి సారిస్తారు. ప్రభుత్వ పథకాల పురోగతి, విధానాల అమలు, సమయ నిర్వహణ, మంత్రిత్వ శాఖల మధ్య సమన్వయం, ప్రభుత్వ సేవ లు అందుతున్న తీరు తదితరాలపై చర్చిస్తారు.

Updated Date - Sep 23 , 2026 | 05:30 AM