Share News

క్యాన్సర్‌ సోకిన పిల్లల్లో 94.5% మందికి నయం

ABN , Publish Date - Feb 22 , 2026 | 06:14 AM

చిన్నతనంలోనే(18ఏళ్ల లోపు వయసు) క్యాన్సర్‌ సోకి ఆ వ్యాధి నుంచి బయటపడిన వారి వివరాలతో దేశంలోనే మొట్టమొదటిసారి రిజిస్ట్రీని ఏర్పాటు చేశారు...

క్యాన్సర్‌ సోకిన పిల్లల్లో 94.5% మందికి నయం

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 21: చిన్నతనంలోనే(18ఏళ్ల లోపు వయసు) క్యాన్సర్‌ సోకి ఆ వ్యాధి నుంచి బయటపడిన వారి వివరాలతో దేశంలోనే మొట్టమొదటిసారి రిజిస్ట్రీని ఏర్పాటు చేశారు. ఈ రిజిస్ట్రీ ప్రకారం క్యాన్సర్‌ చికిత్స పొందిన చిన్నారుల్లో 94.5శాతం మంది ఆ మహమ్మారి నుంచి బయటపడ్డారు. ఢిల్లీలోని ఎయుమ్స్‌, రాజీవ్‌ గాంధీ క్యాన్సర్‌ ఇన్‌స్టిట్యూట్‌ పరిశోధకులు దేశవ్యాప్తంగా 5,419 మంది క్యాన్సర్‌ సోకిన పిల్లలపై అధ్యయనం నిర్వహించి వారికి వచ్చిన వ్యాధి, అందించిన చికిత్స విధానాలతో ఈ రిజిస్ట్రీని రూపొందించారు. ఈ 5,419మంది పిల్లల్లో 40శాతం మందికి ల్యుకేమియా(బ్లడ్‌ క్యాన్సర్‌) సోకింది.

Updated Date - Feb 22 , 2026 | 06:14 AM