ఛత్తీస్‌గఢ్ స్కూళ్లలో మంత్రోచ్చారణ తప్పనిసరి
ABN , Publish Date - Jun 20 , 2026 | 03:56 AM
మధ్యాహ్న భోజనానికి ముందు ‘భోజన మంత్రం’, పాఠశాల ముగిసి ఇంటికి వెళ్లేముందు మరో మంత్రాన్ని చదవడాన్ని తప్పనిసరి చేస్తూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న...
రాయ్‌పుర్, జూన్ 19: మధ్యాహ్న భోజనానికి ముందు ‘భోజన మంత్రం’, పాఠశాల ముగిసి ఇంటికి వెళ్లేముందు మరో మంత్రాన్ని చదవడాన్ని తప్పనిసరి చేస్తూ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం రాజకీయ వివాదానికి దారితీసింది. పిల్లల్లో క్రమశిక్షణ, దేశభక్తి, సాంస్కృతిక విలువలు పెంపొందించడం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నామని రాష్ట్ర ప్రభుత్వం, సీఎం విష్ణుదేవ సాయి చెబుతుండగా.. విపక్ష కాంగ్రెస్ మాత్రం బీజేపీ ప్రభుత్వం పాఠశాలలను ‘ఆర్‌ఎస్‌ఎస్ శాఖలు’గా మార్చడానికి ప్రయత్నిస్తోందని ఆరోపిస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో గాయత్రీ మంత్రం, ఇతర మతపరమైన శ్లోకాల పఠణాన్ని తప్పనిసరి చేయడంపై కాంగ్రెస్ నాయకులు అనేక ప్రశ్నలు లేవనెత్తారు. ఒకవేళ మంత్రాలను ప్రవేశపెడితే, ఇతర మతాల్లోని బోధనలను కూడా ప్రవేశపెడతారా? లేదా ఒకే సంప్రదాయానికి ప్రాధాన్యం ఇస్తారా? అని ప్రశ్నించారు.