Share News

మావోయిస్టులకు అన్నం పెట్టిన ఎస్సై

ABN , Publish Date - Mar 30 , 2026 | 04:56 AM

ఆకలితో ఉన్న మావోయిస్టులకు అన్నం పెట్టి ఓ ఎస్సై మానవత్వం చాటుకున్నారు. ఛత్తీ్‌సగఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది.

మావోయిస్టులకు అన్నం పెట్టిన ఎస్సై

చర్ల, మార్చి 29 (ఆంధ్రజ్యోతి): ఆకలితో ఉన్న మావోయిస్టులకు అన్నం పెట్టి ఓ ఎస్సై మానవత్వం చాటుకున్నారు. ఛత్తీ్‌సగఢ్‌లోని కాంకేర్‌ జిల్లాలో శనివారం ఈ ఘటన చోటుచేసుకుంది. కాంకేర్‌ అడవుల నుంచి కుంజం రాధిక, కడియం సందీప్‌, పద్మ అనే ముగ్గురు మావోయిస్టులు లొంగిపోవడానికి ఈనెల 28న పార్తాపుర్‌ గ్రామానికి వచ్చారు. అదే సమయంలో వాళ్లు ఆకలితో ఉన్నట్టు అక్కడి బలగాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలోనే పార్తాపుర్‌ ఎస్సై రామేశ్వర్‌ చతుర్వేదికి మావోయిస్టులకు భోజనం తెప్పించి, వారితో కలిసి భోజనం చేశారు. అనంతరం ఆ ముగ్గురు మావోయిస్టులు పోలీసుల ముందు లొంగిపోయారు. ఈ ఫొటో కాస్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. గతంలో మావోయిస్టులు, పోలీసులు ఒకరిని ఒకరు చంపుకున్నారని.. కానీ నేడు ఆపరేషన్‌ కగార్‌ వారిని కలిపిందని చర్చించుకుంటున్నారు.

ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు మృతి

ఛత్తీ్‌సగఢ్‌లోని సుకుమా జిల్లా పోలంపల్లి అటవీ ప్రాంతంలో ఆదివారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఒక మావోయిస్టు మృతి చెందాడు. అతడిని ప్లాటూన్‌ నెంబర్‌ 31 కమాండర్‌ కైలా్‌సగా పోలీసులు గుర్తించారు. అతనిపై 5 లక్షల రివార్డు ఉందని, ఘటనా స్థలం నుంచి తుపాకిని స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.

Updated Date - Mar 30 , 2026 | 04:56 AM