Share News

14 లక్షల టన్నుల అదనపు చక్కెర కోటా విడుదల

ABN , Publish Date - Oct 15 , 2026 | 03:45 AM

పండుగల వేళ పంచదార ధరలు మరింతగా పెరగకుండా నిరోధించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది

14 లక్షల టన్నుల అదనపు చక్కెర కోటా విడుదల
sugar

న్యూఢిల్లీ, అక్టోబరు 14: పండుగల వేళ పంచదార ధరలు మరింతగా పెరగకుండా నిరోధించేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. 14 లక్షల టన్నుల పంచదార కోటాను షుగర్‌ మిల్లుల కోసం విడుదల చేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే దిగుమతిదారులకు అదనంగా 2లక్షల టన్నుల పంచదారను కేటాయిస్తున్నట్లు వెల్లడించింది. అంతకుముందు సెప్టెంబరులో 26.5 లక్షల టన్నులు, అక్టోబరులో 30 లక్షల టన్నుల చక్కెర కోటాను ప్రభుత్వం విడుదల చేసింది. కాగా, తాజా కేటాయింపుల్లో మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్‌, కర్ణాటకలకే 83శాతం వాటా దక్కింది.

Updated Date - Oct 15 , 2026 | 04:42 AM