జనాభాలో అసాధారణ మార్పులపై సమాచారం ఇవ్వడం కోసం ప్రత్యేక పోర్టల్
ABN , Publish Date - Oct 15 , 2026 | 03:58 AM
దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జనాభా స్వరూపం అసాధారణంగా మారిపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది
న్యూఢిల్లీ, అక్టోబరు 14: దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జనాభా స్వరూపం అసాధారణంగా మారిపోవడానికి గల కారణాలను తెలుసుకునేందుకు కేంద్రం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందుకోసం ప్రత్యేక పోర్టల్ను((https://demography.mha.gov.in) ప్రారంభించింది. ఒక ప్రాంతంలో ఏ మతానికి చెందిన వారు ఎంత మంది ఉన్నారు? ఇతర ప్రాంతాల నుంచి ఎంత మంది వలస వచ్చి స్థిరపడుతున్నారు? 15 ఏళ్లలో ఆధార్, ఓటరు, రేషన్ కార్డులు ఎక్కడైనా అసాధారణంగా పెరిగాయా? తదితర అంశాలపై సమాచారాన్ని తెలిజేయాలని ప్రజలను, సంస్థలను కోరింది.