సున్నిత అంశాల ప్రసారంపై జాగ్రత్త: కేంద్రం
ABN , Publish Date - Oct 22 , 2026 | 04:48 AM
మతపరమైన విద్వేష పూరిత వ్యాఖ్యలు, నేరాలు-హింసాత్మక దృశ్యాల ప్రసారాలు, వార్తల రూపకల్పనలో ఏఐ వినియోగం, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల వంటి సున్నిత విషయాల్లో జాగ్రత్తగా..
న్యూఢిల్లీ, అక్టోబరు 21: మతపరమైన విద్వేష పూరిత వ్యాఖ్యలు, నేరాలు-హింసాత్మక దృశ్యాల ప్రసారాలు, వార్తల రూపకల్పనలో ఏఐ వినియోగం, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాల వంటి సున్నిత విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలని ప్రైవేటు శాటిలైట్ టీవీ చానెళ్లను కేంద్రం ఆదేశించింది. కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ చట్టం-1995 మేరకు నిర్దేశించిన నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని, ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఈ మేరకు కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ అడ్వైజరీ జారీ చేసింది. టీవీ చర్చల్లో మతతత్వ, దేశ వ్యతిరేక వైఖరులను ప్రోత్సహించకూడదని.. ప్యానెలిస్టులను జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలని, సంపాదకీయ నియంత్రణను పాటించాలని అందులో సూచించింది. మహిళలు, పిల్లలపై జరిగే నేరాలకు సంబంధించిన దృశ్యాల్లో బాధితులు కనిపించడకుండా బ్లర్ చేయాలని తెలిపింది.