Share News

Green Airport in Hosur: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కేంద్రం ఝలక్‌

ABN , Publish Date - Jan 19 , 2026 | 03:51 AM

తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కేంద్ర ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. కృష్ణగిరి జిల్లాలోని పరిశ్రమల నగరం హోసూరు వద్ద గ్రీన్‌ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు రక్షణ...

Green Airport in Hosur: తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కేంద్రం ఝలక్‌

  • హోసూరులో గ్రీన్‌ ఎయిర్‌పోర్ట్‌కు అనుమతి నిరాకరణ

చెన్నై, జనవరి 18(ఆంధ్రజ్యోతి): తమిళనాడు సీఎం స్టాలిన్‌కు కేంద్ర ప్రభుత్వం ఝలక్‌ ఇచ్చింది. కృష్ణగిరి జిల్లాలోని పరిశ్రమల నగరం హోసూరు వద్ద గ్రీన్‌ ఎయిర్‌పోర్టు నిర్మించేందుకు రక్షణ మంత్రిత్వ శాఖ అనుమతి నిరాకరించింది. విమానాశ్రయం కోసం ఇప్పటికే 12 గ్రామాల పరిధిలో 2,980 ఎకరాల భూసేకరణ కోసం ముమ్మరంగా పని చేస్తున్న ఉన్నతాధికారులు ఈ ప్రకటనతో తీవ్ర దిగ్ర్భాంతికి గురయ్యారు. హోసూరు, దాని పరిసరాల్లో ఎన్నో స్వదేశీ, విదేశీ కర్మాగారాలు ఉన్నాయి. దగ్గరలో విమానాశ్రయం లేక ఆ పరిశ్రమలన్నీ బెంగళూరు విమానాశ్రయం నుంచే తమ ఉత్పత్తులను విదేశాలకు ఎగుమతి చేస్తున్నాయి. అయితే, హోసూరులో విమానాశ్రయానికి అనుమతి ఇవ్వలేమంటూ కేంద్ర రక్షణశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. హోసూరు పరిసర ప్రాంతాల్లోని ఆకాశ మార్గాలన్నీ హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ (హెచ్‌ఏఎల్‌) కట్టుబాట్లలో ఉన్నాయని, అక్కడి నుంచి సైనిక, పరిశోధనాత్మక విమానాలు ఎగరటానికే ప్రాధాన్యం కల్పిస్తున్నట్టు లేఖలో పేర్కొంది.

Updated Date - Jan 19 , 2026 | 03:51 AM