Share News

జనాభా లెక్కలకు ప్రైవేటు టీచర్లు

ABN , Publish Date - Oct 17 , 2026 | 06:18 AM

ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లను కూడా ఎన్యూమరేటర్లుగా నియమించవచ్చు. శుక్రవారం ఈమేరకు జనాభా లెక్కల నిబంధనలు 1990కి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది.

జనాభా లెక్కలకు ప్రైవేటు టీచర్లు
senses

న్యూఢిల్లీ, అక్టోబరు 16: ఎయిడెడ్‌, అన్‌ ఎయిడెడ్‌ ప్రైవేటు స్కూళ్లలో పనిచేసే టీచర్లను కూడా ఎన్యూమరేటర్లుగా నియమించవచ్చు. శుక్రవారం ఈమేరకు జనాభా లెక్కల నిబంధనలు 1990కి కేంద్ర ప్రభుత్వం సవరణలు చేసింది. రిజిస్ట్రార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా(ఆర్‌జీఐ) మృత్యుంజయ కుమార్‌ నారాయణ్‌ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేశారు. దీని ప్రకారం... రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు జనాభా సేకరణకు టీచర్లు, క్లర్కులు, అధికారి లేదా ఏ వ్యక్తినైనా నియమించవచ్చు. ‘ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌ లేదా అన్‌ ఎయిడెడ్‌ ప్రైవేటు సంస్థలు, సొసైటీలు, ట్రస్టులకు చెందిన పాఠశాలల ఉపాధ్యాయులను... కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన, స్థానిక సంస్థలు, ప్రభుత్వ రంగ సంస్థలు, బ్యాంకులు, కంపెనీలు, సొసైటీలు, ట్రస్టులకు చెందిన క్లర్కులను లేదా అధికారులను... రాష్ట్ర ప్రభుత్వం లేదా కేంద్ర పాలిత పాలనా యంత్రాంగం సరైన వ్యక్తి అని భావించిన ఎవరినైనా జనాభా లెక్కలు సేకరించే సెన్సెస్‌ అధికారిగా నియమించవచ్చు.’’ ప్రైవేటు పాఠశాలల ఉపాధ్యాయులను సెన్సెస్‌ విధుల్లోకి తీసుకోవడంపై పంజాబ్‌, హరియాణా హైకోర్టులో హరియాణా ప్రోగ్రెసివ్‌ స్కూల్స్‌ కాన్ఫరెన్స్‌ ఒక పిటిషన్‌ వేసింది.

Updated Date - Oct 17 , 2026 | 06:42 AM