Share News

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడే వేతనాలు

ABN , Publish Date - Sep 25 , 2026 | 06:15 AM

ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగుల మూడు రోజుల సమ్మె నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రప్రభుత్వం తన ఉద్యోగులకు 2026 సెప్టెంబరు సంబంధించిన..

కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు నేడే వేతనాలు

  • పెన్షన్‌దారులకు పింఛన్లు కూడా..

  • బ్యాంకుల సమ్మె నేపథ్యంలో సర్కారు నిర్ణయం

న్యూఢిల్లీ, సెప్టెంబరు 24: ప్రభుత్వ రంగ బ్యాంకుల ఉద్యోగుల మూడు రోజుల సమ్మె నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. కేంద్రప్రభుత్వం తన ఉద్యోగులకు 2026 సెప్టెంబరు సంబంధించిన వేతనాలను ఐదు రోజులు ముందుగా, శుక్రవారమే(సెప్టెంబరు 25న) చెల్లించనుంది. ఉద్యోగులకు వేతనాలతోపాటు కేంద్ర ప్రభుత్వ పెన్షన్‌దారుల పింఛన్లు కూడా శుక్రవారమే వారివారి బ్యాంకు ఖాతాల్లో జమ కానున్నాయి. ఇందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్ని శాఖలు, విభాగాలను కేంద్రం ఇప్పటికే ఆదేశించింది. రక్షణ, తపాలా, టెలికాం సహా అన్ని శాఖలు, అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాల ఉద్యోగులు, పారిశ్రామి క ఉద్యోగులు, కేంద్ర ఫించనుదారులకు ఈ నిర్ణయం వర్తిస్తుంది. శుక్రవారం చెల్లించే మొత్తాన్ని అడ్వాన్స్‌గా పరిగణిస్తారు. పూర్తి నెల జీతం లెక్క తేలిన తర్వాత ఏమైనా తేడాలు ఉంటే అక్టోబరు నెల జీతంలో వాటిని సర్దుబాటు చేస్తారు. కాగా, సెప్టెంబరు 26 నుంచి అక్టోబరు 4వ తేదీ వరకు తొమ్మిది రోజుల్లో ప్రభుత్వ రంగ బ్యాంకులు మూడు రోజులు మాత్రమే పని చేయనున్నాయి.

Updated Date - Sep 25 , 2026 | 06:17 AM