కేంద్ర ప్రభుత్వ న్యాయవాదుల ఫీజు పెంపు
ABN , Publish Date - Feb 09 , 2026 | 01:29 AM
కేంద్ర ప్రభుత్వం తరఫున కేసులు వాదించే న్యాయవాదుల ఫీజులను పెంచుతూ న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం పక్షాన కోర్టుల్లో వాదించేందుకు అటార్నీ జనరల్...
గ్రూప్-ఏ లాయర్‌కు ప్రతి కేసుకు ప్రతి రోజుకు 21,600
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 8: కేంద్ర ప్రభుత్వం తరఫున కేసులు వాదించే న్యాయవాదుల ఫీజులను పెంచుతూ న్యాయశాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. కేంద్రం పక్షాన కోర్టుల్లో వాదించేందుకు అటార్నీ జనరల్, సొలిసిటర్ జనరల్, అదనపు సొలిసిటర్ జనరల్ వంటి లా ఆఫీసర్లు ఉన్నప్పటికీ కొన్ని కేసులను న్యాయవాదులకు కూడా అప్పగిస్తారు. వాటిపై వాదించే లాయర్లకు చెల్లించే ఫీజులను చివరిసారిగా 2015లో పెంచగా, మళ్లీ 11 ఏళ్ల విరామం అనంతరం పెంచుతున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రెగ్యులర్ అప్పీళ్లకు హాజరయి, తుది విచారణ వరకు వాదనలు వినిపించే గ్రూప్-ఏ న్యాయవాదులకు ప్రతి రోజూ ప్రతి కేసుకు రూ.21,600 వంతున ప్రభుత్వం చెల్లించనుంది. ప్రస్తుతం రూ.13,500 వంతున చెల్లిస్తున్నారు. గ్రూప్-బి, గ్రూప్-సి న్యాయవాదులకు ఇంతవరకు రూ.9,000 వంతున చెల్లిస్తుండగా దాన్ని రూ.14,400కు పెంచారు.