Cell Phones and Cameras Banned: చార్‌ధామ్ ఆలయాల్లో సెల్‌ఫోన్లు, కెమెరాలపై నిషేధం!
ABN , Publish Date - Jan 19 , 2026 | 05:34 AM
చార్‌ధామ్ యాత్రలో ఆలయాల్లోకి సెల్‌ఫోన్లు, కెమెరాలను అనుమతించరాదని నిర్ణయించారు. ఆలయాల్లోకి వీటిని అనుమతించడం వల్ల దర్శన సమయాల్లో .....
డెహ్రడూన్, జనవరి 18: చార్‌ధామ్ యాత్రలో ఆలయాల్లోకి సెల్‌ఫోన్లు, కెమెరాలను అనుమతించరాదని నిర్ణయించారు. ఆలయాల్లోకి వీటిని అనుమతించడం వల్ల దర్శన సమయాల్లో అనేక సమస్యలు ఎదురవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లా మేజిస్ట్రేట్‌లు, సీనియర్ ఎస్పీల సమావేశంలో దీనిపై సమీక్షించారు. దర్శనానికి వెళ్లే సమయంలో భక్తులు మొబైల్ ఫోన్లు, కెమెరాలను వెలుపల సిబ్బందికి అప్పగించాలని అధికారులు తెలిపారు. ఇకపై ఆలయం బ్యాక్‌గ్రౌండ్‌లో ఫొటోలు, వీడియోలు తీసుకోవడానికి మాత్రమే అనుమతిస్తారని, ఆలయం లోపలికి మాత్రం ఫోన్లు, కెమెరాలను అనుమతించబోరని స్పష్టం చేశారు. గంగోత్రి, యమునోత్రి, కేదార్‌నాథ్, బద్రీనాథ్‌లను గత ఏడాది 50 లక్షలకు పైగా భక్తులు సందర్శించారని, ఈ ఏడాది కూడా యాత్ర సజావుగా సాగేందుకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.