సీఈసీకి వ్యతిరేకంగా విదేశాల్లో నిరసనలు
ABN , Publish Date - Oct 19 , 2026 | 06:09 AM
భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత సంతతి ప్రజలు ఆయా నగరాల్లో వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు.
ఇంటర్నెట్ డెస్క్: భారత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న భారత సంతతి ప్రజలు ఆయా నగరాల్లో వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలిపారు. ‘జంతర్‌మంతర్ ఎవరీ వేర్’ పేరిట శని, ఆదివారాల్లో లండన్, జర్మనీలోని ఎర్లన్‌జెన్, గాటిన్‌జెన్, బెర్లిన్, నెదర్లాండ్స్‌లోని హేగ్, స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్, ఫిన్‌ల్యాండ్‌లోని హెల్సింకి, కెనడాలోని టొరాంటో, వాంకోవర్, మాంట్రియల్, అమెరికాలోని ఆస్టిన్, ఫిలడెల్ఫియా, లాస్ ఏంజిలిస్, షికాగో, జెక్ రిపబ్లిక్‌లోని ప్రేగ్‌లలో వీధుల్లోకి వచ్చి ప్రదర్శనలు నిర్వహించారు. సిడ్నీ, మెల్‌బోర్న్, బ్రిస్బేన్, న్యూయార్క్ నగరాలలోనూ ప్రదర్శనలు నిర్వహించారు.