పశ్చిమాసియాలో 5, 6 తేదీల్లో జరగాల్సిన బోర్డు పరీక్షలు వాయిదా: సీబీఎస్ఈ
ABN , Publish Date - Mar 04 , 2026 | 03:40 AM
పశ్చిమాసియాలో తాజా ఘర్షణ ల నేపథ్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో పశ్చిమాసియా ప్రాంతంలో జరగాల్సిన 10, 12వ తరగతుల పరీక్షలను....
న్యూఢిల్లీ, మార్చి 3: పశ్చిమాసియాలో తాజా ఘర్షణ ల నేపథ్యంలో ఈ నెల 5, 6 తేదీల్లో పశ్చిమాసియా ప్రాంతంలో జరగాల్సిన 10, 12వ తరగతుల పరీక్షలను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) వాయిదా వేసింది. పశ్చిమాసియాలోని బహ్రెయిన్, ఇరాన్, కువైట్, ఒమాన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల కారణంగా ఈ పరీక్షలను వాయిదా వేయాలని నిర్ణయించినట్టు సీబీఎ్‌సఈ ఎగ్జామినేషన్ కంట్రోలర్ సాన్యమ్ భరద్వాజ్ తెలిపారు. కొత్త తేదీలను తర్వాత ప్రకటిస్తామని తెలిపారు. మిగతా పరీక్షలకు సంబంధించి మార్చి 5న పరిస్థితిని సమీక్షిస్తామన్నారు. ఈ ప్రాంతంలో మార్చి 2న జరగాల్సిన పరీక్షను బోర్డు ఆదివారం వాయిదా వేసింది.