సీబీఎస్‌ఈ పోర్టల్‌లో అవాంతరాలు
ABN , Publish Date - May 20 , 2026 | 02:49 AM
సీబీఎస్‌ఈ పోర్టల్‌లో అవాంతరాలు ఏర్పడ్డాయి. 12వ తరగతి జవాబు పత్రాల పునఃమూల్యాంకనానికి సంబంధించి.. అందుబాటులోకి తెచ్చిన పోర్టల్‌లో.....
న్యూఢిల్లీ, మే 19: సీబీఎస్‌ఈ పోర్టల్‌లో అవాంతరాలు ఏర్పడ్డాయి. 12వ తరగతి జవాబు పత్రాల పునఃమూల్యాంకనానికి సంబంధించి.. అందుబాటులోకి తెచ్చిన పోర్టల్‌లో లాగిన్ సంబంధిత సమస్యలు వచ్చాయని విద్యార్థులు సోషల్ మీడియా వేదికగా ఆందోళన వ్యక్తం చేశారు. పోర్టల్ క్రాష్ అయిందని.. లాగిన్ కాలేకపోయామని, దరఖాస్తులను సమర్పించలేక పోయామని పేర్కొన్నారు. ఈ వ్యవహారంపై పరీక్షల నియంత్రణాధికారి భరధ్వాజ్ స్పందిస్తూ.. కొంత మంది విద్యార్థులు సమస్యలు ఎదుర్కొన్నట్టు తెలిపారని, అయితే ఇబ్బందేమీ లేదని చెప్పారు. ఒకవేళ తాత్కాలిక ఇబ్బందులు ఎదురైతే.. కొద్ది సమయం తర్వాత ప్రయత్నించాలని సూచించారు. పోర్టల్ పనితీరు సాధారణంగానే ఉందన్నారు.